Boyapati srinu : రామ్, బోయపాటి మూవీ షురూ...!
Boyapati srinu : హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ క్లాప్ ఇచ్చారు.;
Boyapati Srinu : యంగ్ హీరో రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపోందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్9గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా ఈ రోజున (జూన్ 1) పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. కాగా ఇది రామ్‌కి 20 వ చిత్రం కాగా, బోయపాటికి 10 వ చిత్రం కావడం విశేషం.
అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్దాయిలోనే ఉన్నాయి.. అటు రామ్ నటిస్తోన్న ది వారియర్ రిలీజ్‌కు దగ్గరలో ఉంది.