Boycott Pushpa 2 : బైకాట్ పుష్ప -2 .. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వార్

Update: 2024-12-04 16:59 GMT

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 రిలీజ్ కు ముందే ఫ్యాన్స్ మధ్య వార్ పెడుతోంది. మెగా, అల్లు అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో యుద్ధం నడుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పవన్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు మెగా అభిమానులు. బై కాట్ పుష్ప 2 అని హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు, ప్రమోషన్ కు మెగా ఫ్యామిలీ దూరంగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎక్కడా మెగా హీరోల పేరు వినపడలేదు. అల్లు అర్జున్ కూడా మెగా అనే పదం వాడలేదు. అభిమానులను ఆర్మీ అనే చెప్పుకుంటూ పూనకాలు తెచ్చుకున్నారు. తన ఎదుగుదలకు కారణమైన వారి గురించి కనీసం పేరెత్తకపోవడాన్ని మెగా అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. చిరంజీవి లేకుంటే ఈ పుష్ప ఎక్కడి నుండి వచ్చారంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ వార్ మూవీ రిలీజ్ అయ్యాక ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News