Janhvi Kapoor : ఆ బాధను అబ్బాయిలు భరించలేరు: జాన్వీ కపూర్

Update: 2025-04-19 11:15 GMT

మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అబ్బాయిలు క్షణం కూడా భరించలేరని స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. కానీ కొంతమంది పురుషులు ఈ నొప్పిని చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి సమయంలో మహిళలు మానసిక క్షోభ అనుభవిస్తారని చెప్పారు. అలాంటి సమయంలో వారు ఓదార్పు కోరుకుంటారని తెలిపారు. ‘‘నాకు పీరియడ్స్‌ సమయంలో విపరీతమైన మూడ్‌ స్వింగ్స్‌ వస్తాయి. నా మాట తీరుని బట్టి నేను పీరియడ్స్‌లో ఉన్నానని ఎదుటి వారికి అర్థం అయిపోతుంది. అందుకే నేను చిరాకుగా మాట్లాడగానే ‘నీకు ఇది ఆ సమయమా’ అని అడుగుతారు. అయితే ఈ ప్రశ్న అడిగే విధానమే ఒక్కోసారి బాధను కలిగిస్తుంది. కొందరు ఈ నెలసరి నొప్పి అనేది చాలా చిన్న విషయంగా పరిగణిస్తూ వ్యంగంగా మాట్లాడతారు. దీన్ని అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం మనకు ప్రశాంతత కలిగేలా ప్రవర్తిస్తారు. విశ్రాంతి తీసుకోమని సలహాలిస్తారు’’ కాగా జాన్వీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ మూవీలో నటిస్తున్నారు.

Tags:    

Similar News