Dulquer Salman : పృథ్వీరాజ్, దుల్కర్ టార్గెట్ గా కస్టమ్స్ రైడ్స్

Update: 2025-09-23 11:30 GMT

మళయాల పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అక్కడి టాప్ స్టార్స్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇళ్లపై కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు. ఇది ఒక్క ఇంట్లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ ఇద్దరు హీరోలను ఇళ్లను ఏక కాలంలో సోదాలు చేశారు. అందుకు కారణం.. ఈ ఇద్దరు హీరోలు ఇల్లీగల్ గా అత్యంత ఖరీదైన ఇంపోర్టెడ్ కార్లను కొన్నారు అనే సమాచారం తెలియడం వల్లేనట. ఇంతా చేస్తే కస్టమ్స్ వారికి ఈ హీరోల ఇళ్లల్లో అలాంటివేం కనిపించలేదు. దీంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా హమ్మయ్య అనేసుకుంది.

అయితే కేరళ కస్టమ్స్ ఆఫీసర్స్ కు ఒక విశ్వసనీమైన సమాచారం అందిందట. భూటాన్ నుంచి చాలా ఖరీదైన లక్జరీ కార్లను 100 వరకూ కేరళ రాష్ట్రంలో అమ్మారు అని. అందులో రెండు కార్లు ఈ ఇద్దరు హీరోలు కొన్నారు అనే ఇన్ఫర్మేషన్ రావడంతోనే కస్టమ్స్ వాళ్లు రైడ్ చేశారు. మన దేశంలో ఇలా లక్జరీ కార్లను ఇల్లీగల్ గా ఇంపోర్ట్ అయిన కార్లను కొనడం కూడా నేరమే. అందుకే దాడులు నిర్వహించారు. ఒకవేళ ఇలా ఎవరైనా అక్రమంగా విదేశీ కార్లను కొనుగోలు చేస్తే వాళ్లు చట్ట పరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కస్టమ్స్ వాళ్లు హెచ్చరిస్తున్నారు. సో.. అక్కడే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇవి కొనసాగే అవకాశాలున్నాయి. 

Tags:    

Similar News