Brigida Debut Film "Iravin Nizhal": ఆ సినిమాలో న్యూడ్‌గా.. అతడి కోసమే నటించా: నటి బ్రిగిడా
Brigida Debut Film “Iravin Nizhal”: తన మొదటి సినిమాలోనే AR రెహమాన్ స్వరపరిచిన పాటకు ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉందని తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది.;
Brigida Debut Film "Iravin Nizhal": యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆమె వ్యూయర్స్‌కి పరిచయమే. నటిగా మొదటి అవకాశం వచ్చింది. అదీ పార్థిబన్ చిత్రంలో అందులో న్యూడ్‌గా నటించాలి.. మొదట తటపటాయించింది. కానీ ఆపాత్రకు ఉన్న ప్రాముఖ్యత గురించి దర్శకుడు చెప్పడం, ఇందులో వల్గారిటీకి తావులేదని అనడంతో ఒప్పుకోక తప్పలేదు.. ఈ పాత్ర కోసం తన తల్లిదండ్రులను కూడా సన్నద్ధం చేయాల్సి వచ్చిందని వర్ధమాన నటి బ్రిగిడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పార్థిబన్ యొక్క ప్రయోగాత్మక చిత్రం "ఇరవిన్ నిజల్" ద్వారా బ్రిగిడా వెండితెరకు పరిచయం అవుతోంది.
జులై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొత్తం ఒకే షాట్‌లో రూపొందించారు. ఆస్కార్ విన్నింగ్ గ్రహీత AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నాన్-లీనియర్ సింగిల్ షాట్ ఫిల్మ్ అని మేకర్స్ ప్రచారం చేశారు.
ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, రోబో శంకర్‌తో పాటు మరికొందరు ఇతర నటీనటులు ఉన్నారు. ఈ చిత్రం ద్వారా అరంగేట్రం చేస్తున్న బ్రిగిడా, ఇటీవల ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ చిత్రంలో నటించడంపై తన అనుభవాన్ని పంచుకుంది. సినిమాలో అవసరమైన ఒక న్యూడ్ సీన్‌లో నటించేందుకు తన కుటుంబాన్ని ఎలా ప్రిపేర్ చేసిందో తెలిపింది.
బ్రిగిడా తన అనుభవాన్ని పంచుకుంటూ, రెహమాన్ సంగీతం, పార్తిబన్ దర్శకత్వంతో భారీ స్థాయిలో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తనకు అవకాశం ఇచ్చిన పార్థిబన్‌కి బ్రిగిడా కృతజ్ఞతలు తెలిపింది. తన మొదటి సినిమాలోనే AR రెహమాన్ స్వరపరిచిన పాటకు ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉందని తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది.
"ఇరవిన్ నిజల్" సినిమా కోసం ఇంటిమేట్ సీన్స్ మరియు న్యూడ్ సీన్లలో నటించడం గురించి కూడా బ్రిగిడా ఇంటర్వ్యూలో పంచుకుంది. "నేను న్యూడ్ సీన్ చేయడానికి చాలా భయపడ్డాను చాలా అయిష్టంగా కూడా ఉన్నాను. నాకు మంచి క్యారెక్టర్ చేయమని ఆఫర్ వచ్చిందని, అయితే నేను న్యూడ్ గా నటించాలని, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదని మా తల్లిదండ్రులకు చెప్పాను.
కానీ నన్ను ఒప్పించిన ఒక అంశం ఏమిటంటే ఇది స్వచ్ఛమైన పాత్ర. ఆమె ఒక పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది మరియు ఆ స్థితిలో ఆమె దానిని ఎలా నిర్వహిస్తుందనేది. ప్రేక్షకులు గ్లామరస్ సీన్‌ని చూసే విధంగా ఆ సన్నివేశాన్ని చూడలేరు" అని బ్రిగిడా అన్నారు.
" ఈ పాత్రను ఎవరూ తప్పుగా చూడలేరు. పార్తీబన్ సార్ స్వయంగా నా తల్లిదండ్రులను ఒప్పించారు. ఇది స్వచ్ఛమైన పాత్ర అని మరియు ఆమె అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని అతను వారికి వివరించారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు ఆ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, సార్ (దర్శకుడు పార్తీబన్) మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి ఆ భావోద్వేగాలను తీసుకురాగలదని భావించారు. అలా ఆ సినిమాలో అవకాశం నన్ను వరించింది అని బ్రిగిడా తెలిపింది.