Vijay Sethupathi : విజయ్ సేతుపతిపై బ్రిటీష్ డాక్టర్ సంచలన ఆరోపణలు

Update: 2025-07-30 10:57 GMT

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడుగా వెలుగుతున్నాడు విజయ్ సేతుపతి. అన్ని రకాల పాత్రల్లో అదరగొట్టే ప్రతిభావంతుడు. ప్యాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. మామూలుగా అతను చాలా డౌన్ టు ఎర్త్ అని చెబుతారు. చూస్తుంటాం. తను మాత్రం అదేం లేదు.. నేను రిచ్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాను అని చెబుతుంటాడు. అప్పుడప్పూ కొన్ని సూక్తులు కూడా చెబుతుంటాడు. అలాంటి విజయ్ సేతుపతి ‘విమనైజర్’అంటూ సంచలన ఆరోపణలు చేసింది ఓ బ్రిటీష్ డాక్టర్. ఆమె పేరు డాక్టర్ రమ్య మోహన్.

‘‘కోలీవుడ్ లో డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ అనేది జోక్ కాదు. చాలా పెద్ద విషయం. నాకు తెలిసిన ఒకమ్మాయి మీడియాలో పనిచేస్తూ ఉండేది. తనను సినిమా ప్రపంచంలోకి లాగారు. కానీ తనిప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్(డ్రగ్స్ బాధితులు దాన్నుంచి దూరమయ్యేందుకు ట్రీట్మెంట్ తీసుకునే కేంద్రం) లో చికిత్స తీసుకుంటోంది. ఇండస్ట్రీ ముసుగులో డ్రగ్స్, మానిప్యులేషన్, లావాదేవీల దోపిడీ అనేది కామన్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాకు ఓ గురువులాగా కనిపించే సోకాల్డ్ విజయ్ సేతుపతి ‘కారవాన్ ఫేవర్’కోసం రెండు లక్షలు, లాంగ్ డ్రైవ్స్ కు 50వేలు ఆఫర్ చేస్తుంటాడు. ఇది అతనొక్కడి కథే కాదు. కానీ అతను మాత్రం ఓ పేద్ద సాధువు లాగా బిల్డప్ ఇస్తుంటాడు.. ఇవన్నీ తెలిసినా కొందరు ఇన్ సెన్సిటివ్ మూర్ఖులు బాధితులనే బ్లేమ్ చేస్తుంటారు.. నిజాన్ని కాకుండా అబద్ధాన్ని ప్రశ్నిస్తుంటారు. ఈ విషయం ఆ అమ్మాయి కుటుంబాన్ని కుదిపేసింది. ఇవన్నీ ఆమె డైరీ, ఫోన్ చాట్స్ ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఇదేమీ కథ కాదు. ఇది ఆమె జీవితం.. ఆ అమ్మాయి వేదన..’’ అంటూ విజయ్ సేతుపతిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది రమ్యా మోహన్. ఆ తర్వాత ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఆ విషయం. అయితే ఈ పోస్ట్ పై విజయ్ సేతుపతి ఇప్పటి వరకూ స్పందించలేదు. నిజానికి రమ్యా మోహన్ ఇండస్ట్రీతో సంబంధాలు లేని వ్యక్తి. బ్రిటన్ లో ఉంటోన్న సైకియాట్రీ డాక్టర్. మరి ఈ విషయాలన్నీ తనకు ఎవరు చెప్పారు అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు. 

Tags:    

Similar News