ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ భామ జాన్వీకపూర్ జతకట్టబోతున్నారనే వార్తలొ స్తున్నాయి. కోలివుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షనలో ఈ సినిమా రూపుదిద్దకోబోతోం దనే టాక్ మొదలైంది. పుష్ప - 2 బాక్సఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మూ డేళ్లుగా ఈ మూవీనే ప్రపంచం అన్నట్టు తిరుగుతూ వచ్చిన అల్లు అర్జున్ కు కొంచెం ఫ్రీ టైం దొరికింది. అయితే ‘పుష్ప 2’ సెట్స్ పై ఉండగానే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో అట్లీతో అల్లు అర్జున్ మూవీ లైన్ లోకి వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నా యి. ఈ సినిమాలో హీరోయిన్ ని అట్లీ ఓకే చేశాడట. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను బన్నీకి జోడిగా ఫిక్స్ చేశాడట అట్లీ. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ రాబోతుందనే చర్చ జోరుగా సాగుతోంది.