Venu Udugula : సింగర్ మంగ్లీ, వేణు ఊడుగులపై కేస్

Update: 2026-04-11 08:24 GMT

మొదటి నుంచి హార్డ్ వర్క్ తో కష్టపడి ఎదిగిన వాళ్లుగా కనిపిస్తారు సింగర్ మంగ్లీ అలాగే వేణు ఊడుగుల. ఈ ఇద్దరి జర్నీ కూడా చాలామందికి పాజిటివ్ చూసే అవకాశం ఉంది. అలాంటి ఈ ఇద్దరిపై మోసం చేశారు అనే కారణంతో సుబ్బారావు అనే లాయర్ వేసిన కేస్ పై హాట్ టాపిక్ అయింది. ఆ కేస్ పూర్వాపరాలు పరిశీలించిన పోలీస్ లు ఈ ఇద్దరిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351 (2), 352 కింద వీరిపై కేసు నమోదు చేసారు. మరి అసలు కేస్ ఏంటీ అంటే.. కొన్నాళ్ల క్రితం సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడుతో పాటు వేణు ఊడుగుల కొందరిని నమ్మించారు. ఆ నమ్మకంతో వారిని తక్కువ పెట్టుబడి పెడితే అధికంగా లాభాలు వస్తాయని నమ్మించారు. వీరిని నమ్మినవాళ్లంతా పెట్టుబడులు పెట్టారు. ఈ మొత్తం ఏకంగా 10కోట్లు ఉంటుందట. దీంట్లో అధిక లాభాల గురించి మాట్లాడని వాళ్లకు కొద్ది రోజుల్లోనే తాము మోసపోయం అని అర్థమైంది. దీంతో ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగారు. కానీ మంగ్లీతో పాటు వేణు కూడా వీరిని పట్టించుకోవడం మానేశారట. ఆ కారణంగానే వీరిపై పోలీస్ లు కేస్ నమోదు చేశారు. మరి ఈ విషయంపై ఆ ఇద్దరు ఎలాంటి వివరణలు ఇస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఓ రకంగా వేణు చేసింది రెండు సినిమాలు మాత్రమే. కానీ చాలా సంపన్నమైన జీవన విధానం గడుపుతున్నాడు అని చాలామంది చెబుతున్నారు. అతను మొదలపెట్టిన టైమ్ కు ఇప్పటికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు. ఓ రకంగా విపరీతంగా కోట్లకు పడగలెత్తిన వాళ్లలా అతని ప్రవర్తన ఉందని కూడా చెబుతుంటారు. ఇక మంగ్లీ కూడా కేవలం యూ ట్యూబ్ తో పాటు సినిమా పాటలతో మాత్రమే ఈ స్థాయిలో సంపన్నురాలు అయింది అనేది కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి అనేదీ వారి వాదన. కొన్నాళ్ల క్రితం మంగ్లీ ఒక పాపులర్ యూ ట్యూమ్ నుంచి తప్పుకుంది. ఆ క్రమంలో ఆమె సదరు ఓనర్ ను బెదిరించి భారీ మొత్తంలో వసూలు చేసింది అనేది కూడా కొందరు చెప్పే విషయం. ఏదేమైనా ఈ కేస్ గురించి ఆ ఇద్దరూ ఏం చెబుతారో అనేది చూడాలి. 

Tags:    

Similar News