Peddi Movie : పెద్ది.. చిన్న సినిమాలతో చెలగాటమా..?

Update: 2026-04-11 09:28 GMT

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకుడు. ఈ మూవీ ఈ నెల 30న విడుదల అన్నారు. బట్ ఆ టైమ్ కు రావడం అసాధ్యం అని తేలిపోయింది. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అది కాకుండా విఎఫ్ఎక్స్ కూడా పూర్తి కాలేదు అనేది అందరికీ తెలిసిందే. అదీ కాక సెకండ్ హాఫ్ లో ఆర్ఆర్ కూడా పూర్తి కాలేదు. ఈ కారణంగా పెద్ది వాయిదా పడబోతోందనేది అందరికీ స్పష్టంగా తెలిసిన విషయం. కాకపోతే మూవీ టీమ్ నుంచి ఆ విషయం మాత్రం తేల్చడం లేదు. రిలీజ్ పోస్ట్ పోన్ అనేది ఇన్ డైరెక్ట్ గా అఫీషియల్ న్యూస్. కానీ వీళ్లు ఆ వార్తను అఫీషియల్ గా చెప్పడం లేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఆ కారణాలు ఎలా ఉన్నా ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఉన్న ఊగిసిలాట కారణంగా చాలా సినిమాలు ఇబ్బందులు పడబోతున్నాయి.

పెద్ది కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మిగతా సినిమాల వాళ్లు. పెద్ది డేట్ వేస్తే.. అంతకు ముందో, లేక ఆ తర్వాతో అయినా తమ చిత్రాలు వేయొచ్చు అని భావిస్తున్నారు. వీళ్లు మాత్రం ఆ విషయం తేల్చడం లేదు. దీంతో ఆయా సినిమాలన్నీ చాలా పెద్ద ఊగిసలాటలో పడిపోయాయి. ముఖ్యంగా పెద్ది జూన్ 25న విడుదల చేయాలి అనుకుంటున్నారు అనే టాక్ ఉంది. అయితే ఈ నెల 30న రిలీజ్ అని చెప్పారు అనే కారణంతో మే 1న విడుదల కావాల్సిన అక్కినేని అఖిల్ మూవీ వాయిదా వేశారు. ఆ విషయాన్ని వాళ్లు స్పష్టంగా చెప్పారు కూడా. లెనిన్ జూన్ 26న విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. తాజాగా అఖిల్ బర్త్ డే పోస్టర్ లో కూడా అదే విషయాన్ని చెప్పారు. అవి కాకుండా వేరే సినిమాలు కూడా కేవలం పెద్ది రిలీజ్ డేట్ కోసమే చూస్తున్నాయి. వీళ్లు ఇప్పటికే రెండు డేట్స్ వేశారు. మూడో డేట్ అయినా క్లియర్ గా చెబితే మిగతా చిత్రాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి కదా. కనీసం ఆ స్పృహ లేకుండా ఉండటం ఎంత వరకు కరెక్ట్ అని అంటున్నారు. ఇకనైనా ఆ కొత్త రిలీజ్ డేట్ ఏదో చెబితే బావుంటుంది. 

Tags:    

Similar News