Anupama : ఓటిటిలోకి అనుపమ జానకి స్టేట్ వర్సెస్ కేరళ మూవీ

Update: 2025-08-05 09:29 GMT

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘జానకి స్టేట్ వర్సెస్ కేరళ’.ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు. రీసెంట్ గా కేరళలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఉత్కంఠ భరితమైన కోర్ట్ రూమ్ డ్రామాగా ఓ రేంజ్ లో ఆకట్టుకుందీ మూవీ. సినిమాకు గిరీష్ నారాయణన్ అందించిన పాటలు, గిబ్రన్ నేపథ్య సంగీతం మెయిన్ అసెట్ గా నిలిచాయి.

తాజాగా ‘జానకి vs. స్టేట్ ఆఫ్ కేరళ’ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 15 నుంచి ‘జానకి vs. స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రముఖ డిజిటల్ సంస్థ జీ5లో స్ట్రీమ్ కాబోతోంది. మరి ఓటిటి నుంచి అనుపమ మూవీకి ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి.

Tags:    

Similar News