Sonakshi Sinha: బాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు.. డబ్బులు తీసుకొని..
Sonakshi Sinha: ఓ బాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు అన్న విషయం బాలీవుడ్ అంతా వ్యాపించింది.;
Sonakshi Sinha (tv5news.in)
Sonakshi Sinha: సినిమావారిపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారేం చేసినా.. ఇట్టే ఆ విషయం వైరల్‌గా మారుతుంది. కొన్నిసార్లు వారిపై వచ్చే రూమర్స్ కూడా వైరల్‌గా మారుతుంటాయి. అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు అన్న విషయం బాలీవుడ్ అంతా వ్యాపించింది. తనపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు.
నటీనటులు ఈవెంట్స్ కోసం లక్షల్లో పారితోషికం తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ఈవెంట్‌కు వెళ్లలేకపోతారు. అలాంటి సమయంలో డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటి ఈవెంట్ కోసం పారితోషికం తీసుకొని.. ఈవెంట్‌కు రాకుండా.. డబ్బులు తిరిగి ఇచ్చేయమన్న స్పందించడం లేదంటూ ఆర్గనైజర్ కేసు నమోదు చేశాడు.
యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ తాను ఆర్గనైజ్ చేస్తున్న ఓ ఈవెంట్‌కు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడట. దానికోసం రూ. 37లక్షలు అడ్వాన్స్‌గా కూడా చెల్లించాడట. అయితే సోనాక్షి ఈవెంట్‌కు హాజరు కాలేదని సమాచారం. దీని గురించి అడగడానికి సోనాక్షి మేనేజర్‌కు ఫోన్ చేసినా.. డైరెక్ట్‌గా సోనాక్షినే కాంటాక్ట్ అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.