Chhaava : 10 మిలియన్ క్లబ్ లోకి ఛావా

Update: 2025-03-04 06:15 GMT

లేటెస్ట్ ఇండియన్ సెన్సేషనల్ మూవీ ఛావా 10 మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయింది. అయితే ఇది కలెక్షన్స్ పరంగా కాదు. టికెట్స్ పరంగా. యస్.. ఇండియాలో బిగ్గెస్ట్ టికెట్ బుకింగ్ యాప్ అయిన బుక్ మై షోలో ఛావా టికెట్స్ పరంగా 10 మిలియన్ క్లబ్ లో చేరింది. టెన్ మిలియన్ క్లబ్ లో చేరిన సినిమాల్లో బాలీవుడ్ నుంచి 3వది, ఇండియా నుంచి 5వ సినిమాగా నిలిచింది ఛావా.

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యదత్తా, వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగానూ సంచలనం సృష్టించింది. ఈ నెల 7న తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథగా రూపొందిన ఈ మూవీ మెజారిటీ భారతీయుల భావోద్వేగాలను రేకెత్తించడంలో సూపర్ సక్సెస్ అయింది.

ఇక టెన్ మిలియన్ క్లబ్ పరంగా చూస్తే ఇండియా నుంచి టాప్ ప్లేస్ లో పుష్ప 2 ఉండటం విశేషం. ఆ తర్వాతి ప్లేస్ లో కేజీఎఫ్ 2 నిలిచింది. బుక్ మై షో 10 మిలియన్ క్లబ్ లో ఇప్పటి వరకు కేవలం 8 ఇండియన్ మూవీస్ మాత్రమే ఉన్నాయి. ఆ లిస్ట్ ఎలా ఉందో చూద్దాం.

1. పుష్ప 2 - 20.4 మిలియన్

2. కేజీఎఫ్ 2 - 17.1 మిలియన్

3. బాహుబలి 2 - 16 మిలియన్

4. ఆర్ఆర్ఆర్ - 13.40 మిలియన్

5. కల్కి 2898ఏడి - 13.14 మిలియన్

6. జవాన్ - 12.40 మిలియన్

7. స్త్రీ 2 - 11.16 మిలియన్

8. ఛావా - 10 మిలియన్ (కౌంటింగ్)

సో మొత్తం 8 సినిమాల్లో తెలుగు మూవీసే 4 ఉన్నాయన్నమాట. 

 

Tags:    

Similar News