Bollywood : చావా రిలీజ్ డేట్ చేంజ్

Update: 2024-11-28 10:00 GMT

మొఘల్ చక్రవర్తులను గడగడలాడించిన ఛత్రపతి శివాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్న చిత్రం చావా. ఇటీవలే సామ్ బహదూర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ కొట్టిన విక్కీ ఇప్పుడు శివాజీ బయోపిక్తో ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు డియర్ జిందగీ, ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాల ఫేం లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 14కు వాయిదా పడింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమా డిసెంబర్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల పడటం రష్మిక కు కొంత రిలీఫేనని చెప్పాలి. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. గూజ్ బంప్స్ తెప్పించేలా ఉండటంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు సింహం అని పిలవడం ఈ టీజర్ లో ఉంది.

Tags:    

Similar News