విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ చిత్రం 'ఛావా' మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందింది. విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రను పోషించారు. ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. రష్మిక మందన్న సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో నటించారు. అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో నటించారు. 130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని దినేష్ విజాన్ నిర్మించారు.