Acharya movie : హైదరాబాద్‌లోనే ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్..!
Acharya movie : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఆచార్య.. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు;
Acharya movie : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఆచార్య.. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.
కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. అందులో భాగంగానే ఈ నెల 23న హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరపనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించింది.
వేలాది మంది మెగా అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.