Chiranjeevi: యంగ్ డైరెక్టర్‌తో చిరు సినిమా.. అధికారికంగా ప్రకటన..
Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్‌లోని యంగ్ హీరోలకు సీనియర్ హీరోలు గట్టి పోటీనే ఇస్తున్నారు.;
Chiranjeevi (tv5news.in)
Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్‌లోని యంగ్ హీరోలకు సీనియర్ హీరోలు గట్టి పోటీనే ఇస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న యంగ్ హీరోలకు.. ఏడాదికి ఒకటి కాకపోతే రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ.. సీనియర్ హీరోలు ఛాలెంజ్ విసురుతున్నారు. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పేరు ముందుంటుంది.
ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టి రికార్డ్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు చిరు. అంతే కాకుండా మంచి కథలతో ఏ దర్శకుడు ఆయన తలుపు తట్టినా.. వారికి కథను వినిపించే అవకాశం ఇస్తున్నారు. అలాగే ఇటీవల ఓ యంగ్ డైరెక్టర్ కథను విని ఇంప్రెస్ అయిన చిరు.. తనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
ప్రస్తుతం చిరు నటిస్తున్న నాలుగు సినిమాలు.. నలుగురు సీనియర్ దర్శకులే డైరెక్ట్ చేస్తున్నారు. అందుకే భిన్నంగా ఈసారి ఓ యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చారు చిరు. తానే వెంకీ కుడుముల. 'ఛలో'లాంటి సినిమాతో టాలీవుడ్లోకి హిట్ డైరెక్టర్‌గా ఎంటర్ అయ్యి.. 'భీష్మ'తో మరో హిట్ కొట్టిన వెంకీ.. చాలాకాలంగా ఓ మెగా హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చివరిగా మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు.