Premkumar : క్లాస్ డైరెక్టర్ మాస్ మూవీ

Update: 2025-07-16 11:00 GMT

కొందరు దర్శకుల పేర్లు చెప్పగానే ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ ను దాటి వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొంత ఆశ్చర్యం కలుగుతుంది.. అభిమానం కొద్ది తన జానర్ నుంచి బయటకు రావడం వల్ల అవసరమా అని కూడా అనిపిస్తుంది. అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. పేరు వినగానే ఇతనెవరూ అనుకుంటున్నారా..? తమిళ్ డైరెక్టర్. అక్కడ ‘96’ అనే క్లాసిక్ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు. ఆ వెంటనే కార్తీ, అరవింద్ కుమార్ ప్రధాన పాత్రల్లో సత్యం సుందరం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసిన దర్శకుడు. ఈ రెండు సినిమాల్లో ఎలాంటి హడావిడీ కనిపించదు. సినిమాటిక్ సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ప్యూర్ ఎమోషన్స్ తో హృదయాలను హత్తుకునే కథనం, డైలాగ్స్ తో అద్భుతంగా ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఓ యాక్షన్ థ్రిల్లర్ కు సిద్ధం అవుతున్నాడు.

96, సత్యం సుందరం చూసిన తర్వాత చాలామంది తమిళ్ హీరోలు ప్రేమ్ కుమార్ తో పనిచేయాలనే ఆకాంక్షను ఓపెన్ గానే చెప్పారు. ఆ అవకాశం విక్రమ్ కు దక్కింది. విక్రమ్ హీరోగా ప్రేమ్ కుమార్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది తన జానర్ కు భిన్నంగా పూర్తి యాక్షన్ కంటెంట్ తో రూపొందే సినిమా కావడం విశేషం. తాజాగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ అయింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోందట. మరి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో కూడా ప్రేమ్ కుమార్ ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News