Bollywood Director : హోలీ పండుగపై కామెంట్స్.. బాలీవుడ్ డైరెక్టర్‌పై కేసు
హోలీ పండుగపై బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పండుగ తక్కువ స్థాయి వారు(ఛప్రి) చేసుకునేదని ఆమె వ్యాఖ్యానించారు. ఫరా వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఓ వ్యక్తి ముంబై పోలీసులను ఆశ్రయించగా ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఫరాపై చర్యలు తీసుకోవాలని, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.
సిసింద్రీ , బోర్డర్, ఇరువర్, దిల్ సే, బాద్‌షా, జోష్, దిల్ చాహ్తా హై, క్రిష్, ఓం శాంతి ఓం తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు ఫరా ఖాన్. ఇక మై హూనా సినిమాతో మెగా ఫోన్ పట్టిన ఆమె షారుఖ్ ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్ దీపిక పదుకొణెను సినిమాలకు పరిచయం చేసింది ఫరా ఖానే కావడం గమనార్హం.