ఎన్టీఆర్ దేవర ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. ఈజీగా 500 కోట్ల క్లబ్ లోకి చేరబోతోందని అర్థం అవుతోంది. దేవర దెబ్బకు ఇప్పటికే అనేక రికార్డులు బద్ధలయ్యాయి. మిగతా భాషల్లో కూడా మౌత్ టాక్ తో మరింత కలెక్షన్స్ పెరగబోతున్నాయి. వీకెండ్ తర్వాత గాంధీ జయంతి హాలిడే కూడా దేవరకు కలిసొస్తుంది. బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ పాత్రపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ డే కంటే సెకండ్ డే నుంచి కలెక్షన్స్ పెరిగాయి. అయితే ఈ మూవీకి సంబంధించి సౌత్ లో ఓ స్పెషల్ టాక్ వినిపిస్తోంది. తమిళ్ స్టార్ కార్తీ హీరోగా నటించిన ఖాకీ సినిమా గుర్తుందా..? ఈ మూవీలో థగ్గులు అనే ముఠాలు ఉంటాయి. నార్త్ నుంచి సౌత్ కు లారీ డ్రైలర్స్ వచ్చి.. విపరీతమైన దోపీడీలు చేసిన ముఠాలుగా వీరు 90స్ లో సౌత్ ను వణికించారు. ఆ థగ్గుల లాంటి వారే దేవర తో పాటు కనిపించిన క్లాన్స్ లోని వారు అంటున్నారు.
ఖాకీలోని థగ్గులు కూడా స్వాతంత్ర్య పోరాటంలో ఉంటారు. తర్వాత వారి జీవనోపాధి కోసం హత్యలు చేస్తూ.. దోపీడీలకు తెగబడుతూ ఉంటారు. అలాగే దేవరలోని నాలుగు తెగల మనుషులు కూడా స్వాతంత్ర్య పోరాటంలో ఉంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జీవనో పాధి కోసం దొంగ సరుకును సముద్రం నుంచి తీసుకు వస్తుంటారు. కాకపోతే ఖాకీలోని థగ్గులను స్వాత్రంత్ర్య పోరాట కాలంలో మరీ మంచి వాళ్లుగా చూపించలేదు. దేవరలో మాత్రం గొప్ప యోధులుగా చూపించారు. భయమే తెలియని కర్కశులుగా ప్రెజెంట్ చేశారు. అందుకే వారికి భయం చెప్పడం కోసమే దేవర ముందుకు వస్తాడు. సినిమాలు, రిజల్ట్స్ వేరు అయినా .. ఆరంభంలో వచ్చిన డీటెయిలింగ్ మాత్రం రెండు సినిమాల్లోనూ దాదాపు ఒకటే అంటున్నారు.