Shivaji : శివాజీపై కంప్లైంట్ ఇచ్చారు

Update: 2025-12-23 12:30 GMT

మహిళా వస్త్రధారణపై శివాజీ చేసిన కమెంట్స్ వైరల్ గా మారాయి. ఆడవాళ్లు సరిగ్గా బట్టలు వేసుకోవాలి.. ఒళ్లంతా నిండుగా కప్పుకోవాలి. సామాన్లు కనిపించేలా వస్త్రధారణ చేయొద్దు అంటూ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. ముఖ్యంగా అనసూయ, చిన్మ యి లాంటి వాళ్లంతా మండిపడుతున్నారు. అంతే కాదు అదే మూవీలో నటించిన నవదీప్ సైతం రియాక్ట్ అయ్యాడు. మంచు మనోజ్ అలాంటి వ్యాఖ్యలపై కోపం చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. మొత్తంగా అనుకోని ఈ వ్యవహారం మొత్తం శివాజీ చుట్టుకునేలా ఉంది. ఆ కారణంగానే అతనిపై కంప్లైంట్ చేశారు మహిళా సంఘాల వాళ్లు.

శివాజీ ప్రధానంగా హీరోయిన్లపైనే కామెంట్స్ చేశాడు. ఆ కారణంగానే మహిళా సంఘాల వాళ్లంతా కలిసి ‘మా’ అసోసియేషన్ పైన ఫిర్యాదు చేశారు. అతని కామెంట్స్ విషయంలో చాలా వరకు తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అన్ని వర్గాల వాళ్లంతా డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో మండి పడుతున్నారు. మరి శివాజీ ఈ వ్యవహారంపై ఏం మాట్లాడుతాడు, అతని రియాక్షన్ ఏంటీ అనేది చూడాలి. 

Tags:    

Similar News