దర్శకధీరుడు రాజమౌళి ప్రిన్స్ మహేశ్ బాబు తెరకెక్కిస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటికి లీకైనా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించనుందని తెలుస్తోంది. తాజాగా ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో మహేశ్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైద రాబాద్ కు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు సోషల్ మీడయాలో షేర్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ పై త్వరలోనే అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మూవీ టీం ఇటీవలే హైదరాబాద్లో పూజా కార్యక్రమా ల్ని నిర్వహించింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమా ఉంటుందని సమాచారం. దుర్గా ఆర్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్లో మహేశ్ కనిపించనున్నారు.