Coolie first day collections : కూలీ.. ఫస్ట్ డే రికార్డ్ కు దూరం

Update: 2025-08-15 05:26 GMT

రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో విడుదలైన సినిమా కూలీ. ఓ వైపు వార్ 2 ఉన్నా.. కూలీకి వచ్చిన హైప్ చూస్తే అనేక రికార్డులు బద్ధలవుతాయి అనిపించింది. బట్ అలాంటి అద్భుతాలేం జరగలేదు. కారణం కంటెంట్. లోకేష్ కనకరాజ్ పూర్తిగా ట్రాక్ తప్పి రూపొందించిన సినిమా అని తేల్చారు ప్రేక్షకులు. బలమైన కథ, కథనాలు లేకుండా కేవలం హీరో ఇమేజ్ ను ఎలివేట్ చేస్తూ నెట్టుకొద్దాం అనుకున్నాడు. వర్కవుట్ కాలేదు. చాలా ఎగ్జైటింగ్ గా నాగార్జున చెప్పిన అనేక మాటలు అభాసుపాలయ్యాయి. కూలీ వంద బాషాలతో సమానం అన్నాడు నాగ్. కానీ అందులో రెండు ఎపిసోడ్స్ రేంజ్ లో కూడా లేదన్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్.

మొత్తంగా ఎన్నో అంచనాలతో వచ్చిన ఈమూవీ ఫస్ట్ డే రికార్డ్స్ లో కోలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ ను కూడా చేరుకోలేకపోయింది. అంటే ఈ మూవీతో కోలీవుడ్ ఫస్ట్ వెయ్యి కోట్ల మార్కెట్లోకి అడుగుపెడుతుంది అన్నారు. అంత లేదు అనేది ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే తేలిపోయింది. కూలీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 115.5 కోట్లు వచ్చింది. ఇంత స్టార్ కాస్ట్ ఉన్న మూవీకి ఈ ఫిగర్స్ అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. కూలీ కంటే తమిళనాడులో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ లో 148 కోట్లతో దళపతి విజయ్ లియో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ చిత్రానికీ లోకేష్ కనకరాజే దర్శకుడు.లియో కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా ఇప్పటికీ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంది. 

Tags:    

Similar News