Rajinikanth : కూలీ కథ ఇదేనట

Update: 2025-07-17 11:19 GMT

రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న కూలీ మూవీ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ సినాప్సిస్ చక్కర్లు కొడుతోంది. అయితే వీళ్ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు వచ్చిన కంటెంట్ ను బట్టి చూస్తే ఇదినిజమే అనిపించక మానదు. ఆ కారణంగా ఇది లీక్ అయిన మేటర్ కాదని కూడా అర్థం అవుతుంది. ఆ సినాప్సిస్ ప్రకారం చూస్తే.. ‘వయసు మళ్లిన ఓ రిచ్ గోల్డ్ స్మగ్లర్. తన పాత్ర సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి పాత బంగారు వాచ్ లలో ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తాడు. ఆ క్రమంలోనే అతనికి కలిగిన దురాశ, క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ వల్ల మొత్తం టైమ్ కలిసి రాక మరో కొత్త సామ్రాజ్యంలోకి వెళ్లాల్సి వస్తుంది.. ’ మరి ఆ తర్వాత ఏం జరిగింది. ఆ స్మగ్లర్ తన పాత నేర సామ్రాజ్యాన్ని తిరిగి పొందాడా..? ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటీ.. అతని టీమ్ ఉన్నవాళ్లు ఎవరు..? వాళ్లంతా ఏం చేస్తుంటారు.. ఇతనికి సహకరించారా లేదా అనేది మిగతా కథగా ఊహించుకోవచ్చు.

సో.. లోకేష్ కుమార్ గత సినిమాలు చూసిన ఎవరికైనా ఈ మూవీలో రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షబీర్ లాంటి వాళ్లంతా మొదట ఒకే టీమ్ అనుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత తిరిగి కలుసుకోవాలనుకున్నప్పుడు ఏర్పడిన విభేదాలు కారణంగానే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు చేసే ప్రయత్నాల క్రమంలో సినిమా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు.

ఇంత మంది స్టార్స్ ఉన్నారు కాబట్టి వారి ఎలివేషన్స్, ఇమేజ్ తాలూకూ బిల్డప్స్ తో పాటు సినిమాలోని పాత్రల పరిచయం వరకూ లోకేష్ స్టైల్లో మంచి స్టైలిష్ గా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా ఇది పూర్తిగా లోకేష్ మార్క్ ప్రపంచంలో కనిపించే సినిమా అనుకోవచ్చు. ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న కూలీపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలున్నాయి. కేవలం స్టార్స్ ను నమ్ముకోకుండా బలమైన కంటెంట్ కూడా కనిపిస్తే కూలీ టీమ్ ఆ అంచనాలను అందుకోవడం పెద్ద కష్టమేం కాదు.

Tags:    

Similar News