Kalyan Ram : కళ్యాణ్ రామ్ కోసం కాస్ట్ లీ క్లైమాక్స్

Update: 2024-07-30 08:46 GMT

టాలీవుడ్ లో అతి తక్కు విజయాలతో ఎక్కువ కాలంగా కెరీర్ సాగిస్తోన్న హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఉంటాడు. బట్ కొన్నాళ్లుగా రూట్ మార్చాడు. డిఫరెంట్ కంటెంట్స్ తో కమర్షియల్ హిట్స్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం కెరీర్ లో 21వ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార తర్వాత వచ్చిన అమిగోస్, డెవిల్ సినిమాలు ఆకట్టుకోలేదు. అందుకే ఈ మూవీపై ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో కనిపించబోతోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉండబోతోందని తెలిపింది.

ఇక కళ్యాణ్ రామ్ మార్కెట్ గురించి అందరికీ తెలుసు. అలాంటి హీరో మూవీ క్లైమాక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారట. అది ఈ మూవీ కోసమే. ఈ క్లైమాక్స్ ను ఏకంగా నెల రోజుల పాటు చిత్రీకరించారని చెబుతున్నారు. ఇందుకోసం వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు, ఫైటర్స్ ను వాడారట. మరి కళ్యాణ్ రామ్ కోసం ఇంత భారీ యాక్షన్ అంటే వర్కవుట్ అవుతుందా లేదా అని కాకుండా కంటెంట్ పై నమ్మకంతోనే నిర్మాతలు ఇంత కాస్ట్ లీ క్లైమాక్స్ ను అతని కోసం అరేంజ్ చేశారంటున్నారు. అఫ్ కోర్స్ కళ్యాణ్ రామ్ కూడా ఓ నిర్మాతగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన బాలీవుడ్ బ్యూటీ మేజర్ ఫేమ్ సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. శ్రీకాంత్, సోహైల్ ఖాన్ విలన్స్ గా కనిపించబోతున్నారట.

కళ్యాణ్ రామ్ కోసం ఇంత కాస్ట్ క్లైమాక్స్ చిత్రీకరించడం అతని కెరీర్ లోనే ఫస్ట్ టైమ్. మరి ఇంత భారీ సీక్వెన్స్ ఉన్న ఈ మూవీ ఇంకెంత భారీగా ఉంటుందో కానీ.. బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా హీరో రేంజ్ ఇంకా పెరుగుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News