Hrithik Roshan, NTR : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సాంగ్ పై క్రేజీ అప్డేట్

Update: 2025-03-04 09:00 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’. దేవర తర్వాత చేస్తోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రా ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు చాలా వచ్చాయి. ఇక హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. అతనూ ఏజెంట్ గానే కనిపించబోతున్నాడు. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియాలో డ్యాన్స్ గురించిన ప్రస్తావన వస్తే తెలుగు నుంచి చాలామంది స్టార్స్ కనిపిస్తారు. కానీ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తర్వాతే అందరి పేర్లూ వస్తాయి. తెలుగు నుంచి ఎన్టీఆర్ లేకుండా డ్యాన్స్ ప్రస్తావన ముగియదు. మరి ఈ ఇద్దరూ హీరోలుగా నటిస్తోన్న సినిమాలోనూ ఓ డ్యాన్స్ నంబర్ లేకుంటే ఎలా. పైగా ఆర్ఆర్ఆర్ లో టాలీవుడ్ నుంచి ది బెస్ట్ డ్యాన్సర్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నాటు నాటు అంటూ ప్రపంచాన్నే ఊపేశారు కదా. అందుకే ఈ వార్ 2లోనూ అలాంటి ఓ డ్యాన్స్ నంబర్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అలాంటి పాట ఉంది. కాకపోతే ఇది కేవలం ఇద్దరి మధ్య మాత్రమే వచ్చే పాట కాదు.

ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల మధ్య ఈ పాట చిత్రీకరణ జరుగుతోందట. ఈ పాటలో ఈ ఇద్దరితో పాటు ఏకంగా 500 మంది డ్యాన్సర్స్ కూడా ఉంటారట. మామూలుగా బాలీవుడ్ లో డ్యాన్స్ నంబర్స్ ఇలా భారీగా కనిపిస్తాయి. మరి అంతమందిలో వీరి డ్యాన్స్ అంటే నాటు నాటు రేంజ్ లో ఉండకపోవచ్చు. కాకపోతే అక్కడక్కడా కొన్ని మెరుపు మూమెంట్స్ ఉండొచ్చు. మొత్తంగా ఈ పాటకు సంబంధించి ఫ్యాన్స్ ఎవ్వరూ నాటు నాటు రేంజ్ లో ఊహించుకోకుండా ఉంటేనే బెటర్. 

Tags:    

Similar News