Mohanlal : మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే

Update: 2025-09-21 04:52 GMT

కంప్లీట్ యాక్టర్ గా దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్డమ్ అందుకున్న నటుడు మోహన్ లాల్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను ఏర్పాటు చేసుకున్న అత్యంత ప్రతిభావంతమైన నటుడు ఆయన. ఇప్పటికే పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకున్న మోహన్ లాల్ సిగలో తాజాగా 'దాదా సాహెబ్ ఫాల్కే' చేరింది. 1960 మే 21న కేరళలోని పథినంథిట్ట దగ్గరలో గల ఎలథ్నూన్ గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాలు వేయడం ద్వారా నటనపై ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని సినిమా వరకూ విస్తరించుకున్నాడు.8 యేళ్ల వయసులోనే 1978లో బాల నటుడుగా పరిచయం అయ్యాడు.ఆశ్చర్యం ఏంటంటే.. ఆ మూవీ 25యేళ్ల తర్వాత విడుదలైంది.

హీరోగా మారిన తర్వాత వైవిధ్యమైన పాత్రలతో తనదైన ముద్రను బలంగా వేశాడు. మళయాల సినిమా కమర్షియల్ రేంజ్ ను మార్చిన హీరోగానూ మోహన్ లాల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో 1994లో వచ్చిన గాండీవం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి గోరువంక వాలగానే అనే పాటలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. విశేషం ఏంంటే.. ఈ పాటను ఆయన ఇప్పటికీ తెలుగులోనూ పాడగలడు. అంత జ్నాపక శక్తి ఉంది. 2016లో జనతా గ్యారేజ్ లో కీలక పాత్ర, మనమంతాలో ప్రధాన పాత్రల్లో నటించాడు.

ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న మోహన్ లాల్ ఖాతాలో తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ చేరడం పట్ల ఆయన జ్యూరీకి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

Tags:    

Similar News