Daggubati Ashritha: హాట్ లుక్స్ లో సమంత.. వెంకటేష్ కూతురు కామెంట్
Daggubati Ashritha: హాట్ లుక్స్, ఎక్స్ పోజింగ్ డ్రెస్ లు వేస్తూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.;
Daggubati Ashritha:తగ్గేదేలే.. ఎవరేమనుకుంటే నాకేంటి.. అవకాశాలు అందరికీ రావు.. వచ్చినప్పుడే వాటిని వినియోగించుకోవాలి.. నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి.. అయినా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ముడుచుకుని కూర్చుంటే ఎలా.. చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటే పలకరించే వాళ్లు ఉండరు.. అలా అని ఆత్మాభిమానాన్ని చంపుకుని సమంత పని చేయడం మునుపెన్నడూ చూడలేదు ఆమె అభిమానులు.. అందుకే స్టార్ హీరోయిన్ గా ఆమెని చూస్తున్నారు.
ఆమె సినిమాలకు క్రేజ్ కూడా తగ్గలేదు.. అయితే సమంత ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచింది. హాట్ లుక్స్, ఎక్స్ పోజింగ్ డ్రెస్ లు వేస్తూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ప్రకటనలు, సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలో క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికైంది.
ముంబైలో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్ కు సామ్ అటెండ్ అయింది. అయితే తను ధరించిన దుస్తుతలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషనల్ లో ఆమె వేసుకున్న డ్రెస్ అతిధులను ఆకట్టుకుంది. ఆ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన సామ్.. నాకు అత్యంత ఇష్టమైన లుక్ ఇద అని క్యాప్షన్ పెట్టింది.
దీనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.. అన్నిటి కంటే ముఖ్యంగా టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత స్పెషల్ గా స్పందించింది.. 'ముచ్చటేస్తోంది' అంటూ లవ్ సింబల్ తో ఉన్న ఎమోజీని జత చేసింది. ఈ మధ్యనే ప్రేమ వివాహం చేసుకున్న ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతాను రన్ చేస్తోంది.