Daksha Nagarkar: బంగార్రాజులో జాంబిరెడ్డి భామ.. ఈ చిత్రంలో ఆమె రోల్..
Daksha Nagarkar: తరచుగా ఫోటోలు దిగుతూ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా బంగార్రాజు చిత్రంలో నటించడంతో దక్షా పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది.;
Daksha Nagarkar: ముంబై ముద్దుగుమ్మ దక్షా నాగర్కర్,, దక్షిణ భారత చిత్రాలలో ఎక్కువగా పని చేస్తుంది.. ఆమె మొదటి తెలుగు చిత్రం 2015లో హోరా హోరీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2018లో హుషారులో కూడా నటించింది. అయితే 2021లో విడుదలైన జాంబిరెడ్డి చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో ఆమె మ్యాగీ అనే క్యారెక్టర్‌లో నటించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే దక్షా ఇన్‌స్టాగ్రామ్‌లో 350K ఫాలోవర్స్ ఉన్నారు. తరచుగా ఫోటోలు దిగుతూ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా బంగార్రాజు చిత్రంలో నటించడంతో దక్షా పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది..
అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకడుగు వేయని దక్షకు ఈ చిత్రం ద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కన్నడ చిత్రసీమలోనూ అడుగుపెట్టిన దక్ష ప్లీజ్ లవ్ మీ చిత్రం ద్వార కన్నడిగులకు సుపరిచితం.
దక్షా నాగర్కర్ నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రంలో దక్ష ఫెస్టివల్ సాంగ్‌లో కనిపిస్తుంది. పాట షూటింగ్ సమయంలో తాను రిహార్సల్ చేస్తున్నప్పుడు సరదాగా ఉండేదని ఆమె చెప్పింది.
ఆమె చైతన్యను తన "మొదటి డ్యాన్స్ పార్టనర్" అని పిలిచింది. ఇక చై "కూల్ గై" గా కూడా అభివర్ణించింది. అతను సెట్స్‌లో జోకులు వేసే వాడని. తనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగించిందని చెప్పింది.
"నేను పాట కోసం రిహార్సల్ చేస్తున్నప్పుడు, సరిగా వేసే వరకు ఓపికగా వేచి ఉండేవాడు" అని చైతన్య గురించి చెప్పుకొచ్చింది. ఈ పాట చేయడానికి మొదట్లో తాను ఇష్టపడలేదని దక్ష తెలిపింది. అయితే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ పాట సీక్వెన్స్‌ని వివరించగా ఒప్పుకున్నానని చెప్పింది.
సినిమాలో ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుందని, సినిమా అద్భుతంగా ఆడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నాగార్జున గురించి చెబుతూ.. టాటూలపై ఆయనకున్న ఇష్టం, పాములపై ఆయనకున్న మోహం గురించి చర్చించామని దక్ష తెలిపింది.
ఈ సినిమా ట్రైలర్‌ను బంగార్రాజు మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. బంగార్రాజు 2016లో వచ్చిన కామెడీ డ్రామా సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్. నాగార్జున, నాగ చైతన్యల తండ్రీకొడుకులుగా నటిస్తుండగా కృతి శెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల రచన, దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం థియేటర్లలో బంగార్రాజు సందడి చేయనున్నాడు.