Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా.. దర్శకుడికి ఖరీదైన గిప్ట్
Dasara: నేచురల్ స్టార్ నానీ నటించిన చిత్రం దసరా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.;
Dasara: నేచురల్ స్టార్ నానీ నటించిన చిత్రం దసరా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. సినిమా సూపర్ సక్సెస్ అవడంతో నిర్మాత చెరుకూరి సుధాకర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ సభ్యులకు ఖరీదైన గిప్ట్‌లు అందించారు. దీనిలో భాగంగా దర్శకుడు శ్రీకాంత్‌కు బీఎండబ్ల్యు కారు బహుకరించారు. సినిమా కోసం పనిచేసిన మిగతా టీమ్ సభ్యులకు 10 గ్రాముల బంగారు నాణేలను బహుకరించారు. నానీ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. నానీ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది.