రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ యేడాది సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. పైగా సినిమా రిలీజ్ అయిన మర్నాడే ఆన్ లైన్ లో హెచ్.డి ప్రింట్ లీక్ అయింది. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు కొన్ని కేస్ లు పెట్టాడు. అయినా అప్పటికే నష్టం జరిగిపోయింది. దీనికి తోడు శంకర్ చేసిన మిస్టేక్ లు కూడా సినిమాకు మైనస్ గా మారాయి. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మరో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకుంటాడనుకుంటే అంచనాలు తప్పాయి.
ఇక ఆమధ్య ఓటిటిలో విడుదలై మంచి అప్లాజ్ తెచ్చుకున్న గేమ్ ఛేంజర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు డేట్ ఫిక్స్ అయింది.
ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను జీ 5 ఛానల్ దక్కించుకుంది. ఆ ఛానల్ లో ఈ నెల 27న సాయంత్రి 5.30 గంటలకు ప్రసారం కాబోతోంది. అయితే ఇప్పటికే ఛానల్ వాళ్లు మాస్ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మరి గేమ్ ఛేంజర్ టివిల్లో ఎలాంటి రేటింగ్స్ తెచ్చుకుంటుందో చూడాలి.