దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయ మైన యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఇప్పుడామె తన తల్లి చివరిసారిగా తెరపై కని పించిన చిత్రం సీక్వెల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఐఫా వేడుకలో 'మామ్'కు సీక్వెల్ తీయబోతున్నట్లు శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. 'ఖుషీ ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నీ నేను చూశా. 'ఆర్చీస్', 'లవ్ యాపా'ల్లో అద్భుతంగా నటించింది. ఆమెతో నేను త్వరలోనే సినిమా తీస్త. అది 'మామ్ 2' కావొచ్చు. ఖుషీ తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. శ్రీదేవి నటించిన అన్ని భాషల్లోనూ టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఇప్పుడు జాన్వీ కపూర్, ఖుషీలు కూడా ఆ స్థాయిలో సక్సెస్ అవుతారని నమ్ముతున్న' బోనీ కపూర్ పేర్కొన్నారు. ఇక 'మామ్’ విషయానికొస్తే.. రవి ఉద్యావర్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాత గా వ్యవహరిం చారు. హిందీతో పాటు తెలుగులో నూ విడుదలైన ఈ చిత్రం విజయాన్ని సొంతం చేసు కుంది . ఇందులో శ్రీదేవి నటనకు మరణానంతరం ఉత్తమ నటి అవార్డు వచ్చింది.