Varun Tej : కార్తీక్ సుబ్బరాజ్ తో వరుణ్ తేజ్

Update: 2026-02-23 09:42 GMT

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ తేజ్. ఈ మధ్య కాలంలో అసలే మూవీ కూడా కలిసి రావడం లేదు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని ఈ సారి హారర్ కామెడీతో రాబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ మూవీనే కొరియన్ కనకరాజు. ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. రీసెంట్ గా ఆయన బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన వీడియో అదిరిపోయింది. మరి ఈ మూవీలో కొరియన్ దెయ్యం ఉంటుందా లేదా అనేది చూడాలి. తర్వాత రెండు మూవీస్ లైన్ లో పెట్టుకున్నాడు వరుణ్ తేజ్.

ఈ రెండు సినిమాల్లో ఒకటి బాలాజీ అనే డెబ్యూ దర్శకుడితో. ఇది పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఆల్రెడీ వరుణ్ తేజ్ ఈ కథను, దర్శకుడిని లాక్ చేసుకున్నాడు. రెండోది మాత్రం తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో. యస్.. కార్తీక్ సుబ్బురాజ్ తో ఓ మూవీ చేయబోతున్నాడు వరుణ్. అయితే వరుణ్ లాగానే కార్తీక్ కూడా ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్నాడు. అతని లాస్ట్ మూవీ రెట్రోతో దారుణమైన డిజాస్టర్ చూసి ఉన్నాడు. ఇది సూర్య మూవీ. అలాంటి దర్శకుడితో వరుణ్ తేజ్ మూవీ అంటే కాస్త ఆలోచించాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైమ్ కార్తీక్ ఫస్ట్ తెలుగు మూవీ కాబట్టి ఖచ్చితంగా బలమైన కథతో వస్తాడు అని కూడా అనుకోవచ్చు.

కార్తీక్ సుబ్బరాజ్ ను ఈ సారి తమిళ్ హీరోలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అతనికి కొత్త ఆఫర్స్ కూడా రావడం లేదు. ఆ కారణంగానే తెలుగులో ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది కొందరి మాట. ఆ ప్రయత్నంలో భాగంగానే వరుణ్ తేజ్ కి దొరికాడు అంటున్నారు. మరి ఈ కాంబో ఎలా ఉండబోతుందో అనేది మాత్రం చూడాల్సిందే. 

Tags:    

Similar News