రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడు మాములుగా లేదు. ఈ మధ్య వరుసగా మూవీ షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. రాజా సాబ్ ఇచ్చిన షాక్ తో కొన్ని రోజుల పాటు కామ్ గా ఉంటాడు అనుకున్నారు. బట్ అలాంటిదేం లేదు. ఓ వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. దానికంటే ముందుగా ఫౌజీ చేస్తున్నాడు. అయితే ఫౌజీపై తాజాగా వచ్చిన ఒక అప్డేట్ విషయంలో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అదేంటీ అంటే.. ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 70శాతం పూర్తయిందట. రీసెంట్ గా ఆయన ఓ యాక్షన్ సీక్వెన్స్ లో గాయపడ్డాడు. అయినా నెక్ట్స్ డే నే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అది కూడా భారీ తారాగణంతో సాగిన యాక్షన్ సీక్వెన్స్ కావడంతోనే ఆయన వెంటనే షూటింగ్ లోకి వచ్చాడు. దాదాపు 20రోజుల పాటు ఈ ఎపిసోడ్ పూర్తి చేశాడట. దీంతో 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్టుగా చెప్పారు.
ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ ఇమాన్వి.. అలాగే జయప్రద, మిథున్ చక్రవర్తి వంటి వాళ్లంతా పాల్గొన్నారట. మాగ్జిమం యాక్షన్ సీక్వెన్స్ అన్నీ పూర్తయిపోయాయట. మిగిలిన టాకీ పార్ట్ ను కూడా చాలా వేగంగా పూర్తి చేయాలనుకున్నాడు ప్రభాస్. దీంతో చూస్తుంటే ఈ మూవీ దసరాకే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి నిజంగా దసరా బరిలోనే విడుదలుతుందా లేదా అనేది చూడాలి.