Deepti Sunaina: సునయన పోస్టుల వెనుక అర్థమేంటి షణ్ను.. అంతపనీ చేసిన బిగ్‌బాస్ హౌస్
Deepti Sunaina: 'కనీసం నీ మనస్సాక్షి చెప్పినట్లు విని నిజాయితీగా ఉండు';
Deepti Sunaina: సునయన పోస్టుల వెనుక అర్థమేంటి షణ్ను.. అంతపనీ చేసిన బిగ్‌బాస్ హౌస్ఏమీ లేదంటే ఎవరు నమ్ముతారు.. చూసే కళ్లు గుడ్డివా.. ఇచ్చుకున్న హగ్గులు చెడ్డవా.. అక్కడికీ ఆమె తల్లి వచ్చి చెప్పింది.. ఏం బాలేదు.. ఏంటా ముద్దులు.. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండండి అని.. వింటేనా.. మాకు మేమే.. మీకు మీరే అన్నట్లు లవ్ ట్రాక్‌లో మునిగిపోయారు.. బిగ్‌బాస్ కెమెరా జూమ్ చేసి మరీ చూపించింది షణ్ను, సిరి వ్యవహారాన్ని. ఆటల్లో తనదైన గేమ్ స్ట్రాటజీని ఉపయోగించినా వర్కవుట్ కాలేదు..
ఆడియన్స్‌కి అప్పటికే షణ్ముక్ జస్వంత్ మీద ఒక ఒపీనియన్‌కి వచ్చేశారు.. రన్నరప్‌గా నిలబెట్టారు.. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా ఆ ఒక్కటీ అతడికి విన్నర్ అయ్యే ఛాన్స్‌ని దూరం చేసింది. హౌస్‌లో తాను చేసిన తప్పేంటో బయటకు వచ్చాక తెలుసుకున్నాడు. సిరికి శ్రీమాన్, షణ్ముఖ్‌కి సునయన ఉన్నారని తెలిసినా హౌస్‌లో వాళ్లని వాళ్లు నియంత్రించుకోలేకపోయారు.. ఒకరిపై ఒకరు ప్రేమని కురిపించుకున్నారు.. అదే ఇప్పుడు బెడిసి కొట్టినట్టుంది షణ్ను లవర్ సునయన పెట్టిన పోస్టులు చూస్తుంటే.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్టులతో అభిమానుల్లో రకరకాల సందేహాలు.. 'కనీసం నీ మనస్సాక్షి చెప్పినట్లు విని నిజాయితీగా ఉండు' , ' నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు అనుకూలంగా లేనప్పటకీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ' ఈ సంవత్సరం నాకేమీ బావున్నట్లు అనిపించలేదు.. కానీ నేను చాలా నేర్చుకున్నాను.. అంటూ వరుస పోస్టులు పెట్టింది సునయన. ఇది చూసిన నెటిజన్లు దీప్తి, షణ్నుల రిలేషన్ బానే వుందా లేక బీటలు వారిందా అనే ఆలోచనలో పడ్డారు.
బిగ్‌బాస్ సీజన్2లో సునయన మరో కంటెస్టెంట్ తనీష్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యేది.. మరి అప్పుడు షణ్ము పరిస్థితి ఏంటి అని ఆ ఎపిసోడ్‌ని.. ప్రస్తుత ఎపిసోడ్‌ని కంపేర్ చేస్తున్నారు నెటిజన్లు.. ఏది ఏమైనా క్యూట్ లవర్స్ షణ్ను, సునయన లవ్ బ్రేకప్ అవ్వకపోతే బావుండని అనుకుంటున్నారు. మరి ఈ ఊహాగానాలపై షణ్ను, దీప్తిలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.