దేవర బ్యూటీ జాన్వీ కపూర్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ నిర్మించబోయే ఇషా ఖట్టర్ చిత్రంలో గెస్ట్ రోల్ చేసేందుకు జాన్వీ అంగీకరించింది. మొదట్లో డేట్స్ క్లాష్ కారణంగా తిరస్కరించిన ఈ బ్యూటీ కరణ్ స్పెషల్ రిక్వెస్ట్ చేయడంతో ఓకే చెప్పింది. అవార్డ్ విన్నింగ్ చిత్రం "మసాన్" సినిమా తెరకెక్కించిన నీరజ్ ఘైవాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ తదుపరి చిత్రంలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.