OTT Release : దేవర ఓటీటీ డేట్ ఫిక్స్

Update: 2024-11-05 12:00 GMT

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా దేవర. తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజయంతో మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 8 నుంచి అందుబాటులో రానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలనాటి అందాల నటి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై కనిపించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్రిజ్, శ్రీకాంత్లు కీలకపాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ఇతి వృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దేవరగా ఎన్టీఆర్, భైరవగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇద్దరి మధ్య జరిగిన పోరాటమే ఈ సినిమా. వీళ్లిద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ ఏం చేశాడు.. దేవర ఎందుకు వద్దన్నాడు..? ఇవన్నీ సినిమాలో చూడాల్సిందే.

Tags:    

Similar News