యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దేవర. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన దేవరతో ఎన్టీఆర్ తన కెరీర్ లోనే పెద్ద విజయం చూశాడు. రాజమౌళి మూవీ తర్వాత సినిమా ఎవరిదైనా అనే సెంటిమెంట్ ను కూడా అతనే బ్రేక్ చేశాడు. ఈ మూవీ ఏకంగా 500 కోట్ల క్లబ్ లో చేరింది. కొన్ని చోట్ల పాత రికార్డులను బద్ధలు కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగిందని చెప్పుకున్నారు. అలాగే విలన్ గా సైఫ్ అలీఖాన్ కు మంచి ఎంట్రీ దొరికింది ఇక్కడ. అనిరుధ్ మ్యూజిక్ కు, రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ అంతా కలిసి సినిమాను టెక్నికల్ గా బ్రిలియంట్ అనిపించేశాయి.
ప్రస్తుతం దేవర ఆరోవారం నడుస్తోంది. కొన్ని థియేటర్స్ లో ఇంకా స్ట్రాంగ్ గానే పర్ఫామ్ చేస్తోంది. అయితే 50 రోజుల పోస్టర్ పడే వరకూ ఓటిటిలో విడుదల చేయరేమో అనుకున్నారు. బట్ ఓటిటి రూల్స్ ప్రకారం 45 రోజుల తర్వాత ఓటిటికి విడుదల చేస్తున్నారు. దేవర ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 8 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ కాబోతోందీ మూవీ. అయితే 8న తెలుగు, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లోనే స్ట్రీమ్ అవుతుంది. హిందీలో రావడానికి కాస్త టైమ్ పడుతుంది. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న దేవర బుల్లితెరపై ఎలాంటి అప్లాజ్ అందుకుంటాడో చూడాలి.