మరికొన్ని గంటల్లో కోట్లమంది ప్రేక్షకులు ఎదురు చూస్తోన్న దేవర సినిమా విడుదల కాబోతోంది. ఈ లోగానే సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే యూఎస్ ఆడియన్స్ నుంచి ఫీడ్ బ్యాక్ రావాలి. మనకే తెలియాలంటే 26న అర్థరాత్రి నుంచి థియేటర్స్ దగ్గర కాపలా కాయాల్సి ఉంటుంది. తెలుు స్టేట్స్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేదు. ఇది ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసింది. బట్ ఇతర చోట్ల అగ్రెసివ్ గా వెళుతున్నాడు ఎన్టీఆర్. తాజాగా లాస్ ఏంజెల్స్ లో ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన తర్వాత స్టాండప్ అప్లాజ్ వచ్చింది. తెలుగు నటులకు సంబంధించి ఇది అత్యంత అరుదుగా చూస్తాం. ఇవన్నీ చూసి తెలుగులో ప్రమోషన్స్ లేవు అనుకున్నారు ఫ్యాన్స్. బట్ టెక్నికల్ టీమ్ తో కలిసి కొరటాల శివ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూలో ఎక్కువగా అనిరుధ్ గురించే అడిగారు. ఇప్పటి వరకూ అతని వర్క్ మైనస్ అనే భావన చాలామందిలో ఉంది. బట్ ఈ ఇంటర్వ్యూలో దేవర గురించి అనిరుధ్ ఇచ్చిన హైప్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఉంది. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ రాలేదు అన్నాడు. తన కెరీర్ లో ఈ తరహా మాస్ మూవీకి మ్యూజిక్ చేయలేదని.. అందుకే స్పెషల్ గా ఉంటుందని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడానని.. అది హాలీవుడ్ లో బ్యాట్ మేన్ తరహా బ్యాక్ గ్రౌండ్ లా వినిపిస్తుందని.. ఇది ఆడియన్స్ కు ఓ కొత్త ఫీల్ ని ఇస్తుందని చెప్పాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సైతం ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే దేవరలో ఏదో మ్యాజిక్ ఉందని మాత్రం అర్థం అవుతోంది. ఏదైతేనేం.. ప్రీ రిలీజ్ లేకపోయినా అనిరుధ్ ఇచ్చిన హైప్ ఫ్యాన్స్ కు ఓ కొత్త కిక్ ఇస్తోందనే చెప్పాలి.