Devara collections : మూడు రోజుల్లోనే 300 కోట్లు

Update: 2024-09-30 06:52 GMT

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన దేవర బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ నటన, అనిరుధ్ ఆర్ఆర్ కు తోడు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది దేవర. ఎన్టీఆర్ కు సంబంధించిన తండ్రి కొడుకులుగా నటిస్తే సినిమా డిజాస్టర్, అలాగే రాజమౌళి మూవీ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసింది దేవర. జాన్వీ కపూర్ పాత్ర పెద్దగా ఆకట్టుకోకపోయినా.. డ్యూయొల్ రోల్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. మొదటి రోజే 170 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచిన దేవర రెండో రోజు కాస్త డల్ అయినా.. సండే రోజు మళ్లీ పికప్ అయింది. ముఖ్యంగా డే ఒన్ ఎక్కడైతే డల్ అనిపించుకుందో ఆ ప్రాంతాల్లో ఆదివారం అదరగొట్టింది. కర్ణాటక, హిందీ మార్కెట్ లు దేవర ఎఫెక్ట్ కు షేక్ అవుతున్నాయి.


ఇక మూడు రోజుల్లోనే దేవర 304 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది దేవర. 180 కోట్లు షేర్ థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ మొత్తం సాధించాలంటే మరో 50 కోట్లు వసూలు చేస్తే చాలు. బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కొన్నవాళ్లంతా సేఫ్ అయిపోతారు. దేవర ఊపు చూస్తుంటే అదేమంత పెద్ద కష్టం కాదు అనిపిస్తోంది. పైగా దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా 500 కోట్ల ఫిగర్ ను టచ్ చేస్తుందంటున్నారు. నిజానికి సెకండ్ హాఫ్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే దేవర కలెక్షన్స్ నిజంగానే ఊచకోత అన్నట్టుగా ఉండేవి. ఏదేమైనా మూడు రోజుల్లోనే 300 కోట్లు మార్క్ ను దాటడం కొరటాల శివతో కలిపి ఎన్టీఆర్ సాధించడం చిన్న విషయం కాదు.

Tags:    

Similar News