Ustaad Bhagat Singh Movie Update : ఉస్తాద్ భగత్ సింగ్..దేవీశ్రీ సంచలన అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ . ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఒక కొత్త షెడ్యూల్ నిన్ననే ప్రారంభమైంది. ఇందులో ఒక ఎనర్జిటిక్ డ్యాన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ పాటకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో మాట్లాడిన దేవీశ్రీ ప్రసాద్ .. మూవీలోని ఒక పాటలో పవర్ స్టార్ డ్యాన్స్ అదరగొట్టినట్లు చెప్పాడు. ట్యూన్ బాగా నచ్చిందని తన చేయి పట్టుకొని చెప్పాడట పవన్. ఆ ట్యూన్ తో చాలా కాలం తర్వాత తనలో మళ్లీ ఉత్సాహంగా డ్యాన్స్ చేయాలన్న కోరిన కలిగిందని చెప్పాడట. ఇటీవల ఆ పాటను చిత్రీకరించామని.. హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. దీంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఉత్సాహం పెరిగింది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, అప్ డేట్స్ అభిమానుల్లో భారీ అంచానాలు రేపగా.. తాజాగా రాష్ట్రార్ చెప్పిన విషయాలు మరింత హైపన్ ను సృష్టి స్తున్నాయి.