Dhanush : రాంఝనాలో మార్పులు, ఆగ్రహం వ్యక్తం చేసిన ధనుష్

Update: 2025-08-04 09:38 GMT

2013 జూన్ 21న విడుదలైన రాంఝనా సినిమా గుర్తుందా. ఎందుకు ఉండదు. ధనుష్ అద్భుతమైన నటన, ఆనంద్ ఎల్ రాయ్ గొప్ప దర్శకత్వం ఈ చిత్రాన్ని ఎవర్ గ్రీన్ గా మార్చాయి. అఫ్ కోర్స్ సోనమ్ కపూర్ కూడా ఫస్ట్ టైమ్ నటన తెలుసు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇతర పాత్రల్లో అభయ్ డియోల్, స్వర భాస్కర్ సైతం ఆకట్టుకుంటారు. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం మెయిన్ హైలెట్. ఈ మూవీని తాజాగా రీ రిలీజ్ చేశారు. అయితే రీ రిలీజ్ లో ‘ఏ.ఐ’సాయంతో క్లైమాక్స్ ను మార్చారట. అది ఆర్టిఫిషియల్ గా ఉంది. మొదటి సారి చూసిన ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అది మిస్ అయ్యేలా ఉంది. దీంతో ఈ విషయంపై హీరో ధనుష్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు.

‘రాంఝనా రీ రిలీజ్ లో ఏఐ సాయంతో క్లైమాక్స్ ను మార్చడం నాకు నచ్చలేదు. నేను 12యేళ్ల క్రితం ఒప్పుకున్న సినిమా ఇది కాదు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ తో మార్పులు చేయడం కళను, కళాకారులను ఇబ్బంది పెడుతుంది. ఈ క్లైమాక్స్ మార్చడం వల్ల సినిమా ఆత్మనే కోల్పోయింది. నిజానికి నేను తీవ్రంగా అభ్యంతరం చెప్పాను. అయినా వినకుండా మార్చారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా కొన్ని కఠినమైన నిబంధనలు ఉంటాయని ఆశిస్తున్నాను. ఏదైనా ఈ విషయం నన్ను బాధించింది’ అంటూ ఒక లెటర్ విడుదల చేశాడు ధనుష్. మరి ఇప్పటికైనా ఒరిజినల్ ను అలాగే ఉంచుతారా లేదా అనేది చూడాలి. నిజమే.. ఇలా చేయడం వల్ల సినిమాల ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. ఒక జెనరేషన్ లో శాడ్ ఎండింగ్ ఉంటే దాన్ని మరో జెనరేషన్ కు హ్యాపీ ఎండింగ్ గా మార్చడం సరికాదు. 

 

Tags:    

Similar News