ధనుష్ హీరోగాగానే కాక దర్శకుడుగానూ సత్తా చాటాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన రాయన్ మూవీతో మొత్తం సౌత్ ను ఆశ్చర్యపరిచాడు. మేకింగ్, టేకింగ్ పరంగా మెస్మరైజ్ చేశాడు. ఓ సాధారణ కథనే అసాధారణంగా చెప్పి మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో ఓ రొటీన్ లవ్ స్టోరీని వెరీ ఎంగేజింగ్ గా చెప్పి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే మూవీ యూత్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తోంది. ధనుష్ తన మేనల్లుడు(అక్క కొడుకు) పవిష్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సినిమాకు కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. తెలుగులోనూ ఆకట్టుకుంటోంది. కాకపోతే ఇక్కడ స్టార్ కాస్ట్ లేకపోవడం కొంత మైనస్ గా మారింది. బట్ చూసిన వాళ్లంతా తెగ పొగిడేస్తున్నారీ చిత్రాన్ని.
యూత్ లో లవ్ ఫెయిల్యూర్స్ అనేవి అందరికీ దాదాపు కామన్. ఆ కామన్ పాయింట్ నే పట్టుకుని.. నేటి యూత్ ట్రెండ్ కు అనుగుణంగా అదే పనిగా బాధపడటం కాకుండా బ్రేకప్ చెప్పిన అమ్మాయి పెళ్లికీ వెళ్లి మూవ్ ఆన్ అవుతూ ఉండే ఓ కుర్రాడి కథకు మరో యంగ్ స్టర్స్ లవ్ స్టోరీని యాడ్ చేస్తూ ఈ రెండు ప్రేమకథలతో పాటు వారి వ్యక్తిత్వాలను వివరించేందుకు మరో ఫ్రెండ్ క్యారెక్టర్ ను సెట్ చేసి.. హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు ధనుష్. నిజానికి ధనుష్ నుంచి ఇలాంటి రైటప్ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. కథ పరంగా చూస్తే వెరీ రొటీన్. బట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో మాయ చేశాడు. అందుకే ఈ చిత్రానికి అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ వచ్చేస్తోంది. తెలుగులో కాస్త ప్రమోషన్స్ చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదేమో కానీ.. క్యాజువల్ గా వెళ్లి చూసిన వాళ్లంతా సర్ ప్రైజింగ్ గా హిట్ టాక్ తో బయటకు వస్తున్నారు.