Dhanush is a beggar
మల్టీ టాలెంటెడ్ స్టార్ ధనుష్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.హీరోగా నటిస్తూనే డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఈ ఫిబ్రవరిలో అతను దర్శకత్వం చేసిన కుర్రాళ్ల సినిమా ఒకటి విడుదల కాబోతోంది. అలాగే తిరు తర్వాత నిత్య మీనన్ తో కలిసి ఇడ్లీకొట్టు అనే సినిమా చేస్తున్నాడు. దీనికీ తనే దర్శకుడు. ఇవి కాక బాలీవుడ్ లోఓ ప్రాజెక్ట్ ఉంది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న కుబేర మూవీ ఉంది. ఇక లాస్ట్ ఇయర్ అతను డైరెక్ట్ చేసిన రాయన్ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. దర్శకుడుగానూ అతని ముద్ర స్పష్టంగా కనిపించింది. మరోవైపు సితార బ్యానర్ లో సార్ తర్వాత మళ్లీ అదే దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇన్ని విధాలుగా బిజీగా ఉన్న ధనుష్ ను బిచ్చగాడు అంటే ఎవరైనా ఊరుకుంటారా. ఊరుకోరు నిజమే.. కానీ అదో పాత్ర అంటే. యస్.. అతనూ బిచ్చగాడుగా నటిస్తున్నాడు.
బిచ్చగాడు అనగానే ఎవరికైనా విజయ్ ఆంటోనీయే గుర్తొస్తాడు.ఆ రేంజ్ లో ఇంపాక్ట్ వేశాడా పాత్రతో. మరి అలాంటి పాత్ర ధనుష్ లాంటి స్టార్ చేస్తే ఎలా ఉంటుందో కానీ.. ఆ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడైతే కుబేర అవుతుంది. అవును కుబేర మూవీలో ధనుష్ బెగ్గర్ గానే నటిస్తున్నాడట. అతని పాత్ర బిచ్చగాడుగా ఉంటుందని చెప్పాడు శేఖర్. మరి ఈ బిచ్చగాడికి అపర కుబేరుడైన నాగార్జున పాత్రకూ.. ఉన్న సంబంధం ఏంటీ అనేది తెరపైనే చూడాలి.పైగా రష్మిక పాత్రను కూడా ఇంట్రెస్టింగ్ గానే ఇంటర్ డ్యూస్ చేశాడు దర్శకుడు. సో.. ఈ మూడు ప్రధాన పాత్రలకు తోడు.. ఇంటర్నేషనల్ మాఫియాను కూడా యాడ్ చేశాడు. ఏదైనా శేఖర్ కమ్ముల తన స్టైల్ కు భిన్నంగా చేస్తోన్న ఈ కుబేరలో ధనుష్ బెగ్గర్ గా కనిపించబోతున్నాడు అనే మాట టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.