సౌత్ లో షార్ట్ టైమ్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వచ్చిన వాళ్లలో ప్రశాంత్ నీల్ తర్వాత లోకేష్ కనకరాజ్ కనిపిస్తాడు. ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా రేంజ్ కు వెళ్లాడు. లోకేష్ సౌత్ లో మంచి ఇమేజ్ తో ఉన్నాడు. కూలీతో కలిపి అతను డైరెక్ట్ చేసిన సినిమాలు 6 మాత్రమే. అంతకు ఓ ఆంథాలజీలో ఓ పార్ట్ డైరెక్ట్ చేసి ఉన్నాడు. బట్ రెండో సినిమా ఖైదీతో అతని రేంజ్ మారిపోయింది. ఆ వెంటనే వచ్చిన మాస్టర్ బ్లాక్ బస్టర్ అయితే.. విక్రమ్ కమల్ హాసన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లియో యావరేజ్ అనిపించుకున్నా వసూళ్లు వచ్చాయి. ఈటైమ్ లో రజినీకాంత్ తో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇందులో స్టార్ కాస్ట్ చూసిన తర్వాత కోలీవుడ్ నుంచి ఫస్ట్ 1000 కోట్లు గ్యారెంటీ అనుకున్నారు. మొత్తంగా భారీ అంచనాలతో విడుదలైన కూలీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఓపెనింగ్ డే వసూళ్లు బానే ఉన్నాయి. కానీ కంటెంట్ పరంగా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అన్నిటికీ మించి ఈ మూవీ విషయంలో లోకేష్ కనకరాజ్ నమ్మకద్రోహం చేశాడు అనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.
కూలీలో హైలెట్స్ ఏంటీ అంటే రెండే అని చెబుతున్నారు. ఒకటి మళయాల నటుడు సౌబిర్ షాహిర్, కన్నడ బ్యూటీ రచిత రామ్ గురించే చెబుతున్నారు. అంటే రజినీకాంత్ లాంటి టాప్ స్టార్ పాత్రకు ఆ రేంజ్ లో మలచలేదు అనే కదా అర్థం. అన్నిటికీ మించి నాగార్జునను విలన్ పాత్రకు ఒప్పించాడు. ఇందుకోసం నాగ్ కూడా ఏడు సార్లు స్క్రిప్ట్ విన్నాడట. అన్నిసార్లు విని నో చెప్పినా.. ఏదో మిరాకిల్ చేస్తా అన్నట్టుగా నాగ్ ను నమ్మించాడు. అటు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రనూ అంతే ఒప్పించాడు. బట్ ఈ రెండు పాత్రల్లో కూడా నాగ్ కంటే కూడా విలన్ గా సౌబిర్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఉపేంద్ర అయితే దారుణం అనే చెప్పాలి. డైలాగ్స్ కూడా లేవు. ఏదో పాత సినిమాల్లో పనిమనిషులకు ఉండేలా ఒకట్రెండు డైలాగ్స్ నే రిపీట్ చేశాడు. అటు ఆమిర్ ఖాన్ పాత్ర కమెడియన్ గా తేలిపోయింది. ఇంతమందిని నమ్మించిన లోకేష్ .. చివరికి వారికి ద్రోహం చేశాడు అనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి లియో టైమ్ లోనే కామెంట్స్ వచ్చాయి. బట్ ఫస్ట్ ఫ్లాప్ కదా అనుకున్నారు. కాకపోతే విజయ్ వల్ల లియో కమర్షియల్ గా హిట్ అనిపించుకుంది. బట్ కూలీ విషయంలో మాత్రం లోకేష్ ను స్పేర్ చేయడం లేదు జనాలు. పైగా తనను తాను రాజమౌళితో కంపేర్ చేసుకున్నాడు. తాను రాజమౌళిలా ఏళ్ల తరబడి షూటింగ్స్ చేయను అన్నాడు. అలాగే రాజమౌళిలా అతను కూడా అపజయమే లేకుండా దూసుకుపోతున్నాడు అన్నారు. ఇవన్నీ చూస్తే లోకేష్ హవా త్వరలోనే ముగిసిపోయేలా ఉందంటున్నారు. అదీ కాక మనోడు ఇటు దర్శకత్వం, నిర్మాణం, నటన, కథలు ఇస్తుండటం అంటూ అన్ని పడవల మీదా కాళ్లు వేస్తున్నాడు. ఈ ఫీల్డ్ లో ఏం చేసినా.. ఒక దగ్గర కుదురుగా, శ్రద్ధగా ఉంటేనే సక్సెస్. అది పూర్తయ్యాక మరో అడుగు వేయొచ్చు. కానీ ఒకేసారి అన్ని అడుగులూ వేస్తాం అంటే అడుగులు తడబడతాయి.. చివరికి దారీ తప్పుతారు.