దళపతి విజయ్ హీరోగా నటించిన మూవీ జన నాయగన్. హెచ్ వినోధ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. మామూలుగా అయితే జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. నేషనల్ సెన్సార్ వరకు వెళ్లినా ప్రాబ్లమ్ క్లియర్ కాలేదు. అందుకు పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ కారణంగా ఈ మూవీని ఆపేశారు అనేది చాలామందికి అర్థమైంది. మమితా బైజు కీలక పాత్రలో ఫీమేల్ లీడ్ లో పూజాహెగ్డే నటించారు. ఈ మూవీలో విజయ్ నుంచి కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ. అందుకే ఆపేశారు. కనీసం ఎన్నికల తర్వాతైనా విడుదల చేస్తారేమో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ టైమ్ లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.
జన నాయగన్ మూవీ నుంచి కొన్ని సీన్స్ ను లీక్ చేశారు. ముఖ్యంగా విజయ్ ఇంట్రో సీన్ తో పాటు ఓ ఫైట్ సీన్ ను కూడా లీక్ చేశారు. ఇది రకరకాలుగా ఉంది. చాలామంది వకీల్ సాబ్ నుంచి ఇంట్రోను లేపేశారు అనే టాక్ కూడా ఉంది. సరే తెలుగును పక్కన పెడితే తమిళ్ లో మాత్రం ఈ మూవీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఓ వైపు ఓటిటి డీల్ ను వాళ్లు రద్దు చేసుకున్నారు. ఈ టైమ్ లో ఇలాంటి లీక్స్ లు రావడం పెద్ద మైనస్ అనేది నిజం. అయితే ఈ విషయాన్ని ప్రొడక్షన్ కంపెనీ సీరియస్ గా తీసుకుంది. ఇమ్మీడియొట్ గా దీనిపై చర్యలు తీసుకోవాలని కోర్ట్ నుంచి నోటీస్ లు పంపించారు. ఈ వీడియోను ఎక్కడా ఏ రకంగానూ అప్లోడ్ చేయవద్దు అనే ఆర్డర్స్ తీసుకున్నారు. అంటే యూ ట్యూబ్ లోనే కాదు.. అన్ని రకాల సోషల్ మీడియాలోనూ ఈ వీడియోలు, ఫోటోస్ తో సహా ఎవరూ ఏరకంగానూ పబ్లిష్ చేయవద్దు అని కోర్ట్ నుంచి చెప్పించారు.అయితే ఈ లోగానే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది.