Dacoit Movie Review : డెకాయిట్ మూవీ పర్ఫెక్ట్ రివ్యూ

Update: 2026-04-10 07:34 GMT

రివ్యూ : డెకాయిట్

ఆర్టిస్ట్స్ : అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునిల్, అతుల్ కులకర్ణి, జేన్ మారీఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు.

ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

నేపథ్య సంగీతం : గ్యానీ

సినిమాటోగ్రఫీ : ధనుష్ భాస్కర్

నిర్మాత : సుప్రియ యార్లగడ్డ

దర్శకత్వం : షనీల్ డియో

అడివి శేష్ మూవీస్ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. అతను ఎంచుకుంటోన్న కథల్లో నవ్యత ఉంటుంది. పాత కథలే అయినా కొత్తగా చెప్పడం కనిపిస్తుంది. అందుకే అతని సక్సెస్ రేట్ చాలా బావుంటుంది. అయితే అతని శైలికి భిన్నంగా ఫస్ట్ టైమ్ డెకాయిట్ అనే టైటిల్ తో ఓ మూవీ చేశాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. మృణాల్ తో శేష్ అనగానే కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుందని చాలామంది భావించారు. మరి ఇవాళ విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

హరి(అడివి శేష్) ఓ అనాథ. అతనితో పాటు ఓ అమ్మాయి కూడా ఉంటుంది. హరి.. సరస్వతిని ప్రేమిస్తాడు. తను కూడా హరిని బాగా ప్రేమిస్తుంది. సరస్వతిని అతను జూలియట్ అని పిలుస్తుంటాడు. జూలియట్ ది పెద్ద ఫ్యామిలీ. అతనికి ఓ అన్న ఉంటాడు. అయినా హరి ఆమెకు ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ఇందుకోసం హరితో పాటు ఉండే అమ్మాయి సాయం చేస్తుంటుంది. ఈ విషయం జూలియట్ వాళ్ల అన్నకు తెలుస్తుంది. దీంతో అతను ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. దీన్ని వ్యతిరేకించే క్రమంలో అతన్ని హరి చంపేస్తాడు. సరిగ్గా అదే టైమ్ లో జూలియట్ కూడా చూస్తుంది. దీంతో ఇది పెద్ద పోలీస్ కేస్ అవుతుంది. జూలియట్ .. హరినే ఈ హత్య చేశాడు.. దీంతో పాటు అమ్మాయిపై రేప్ కూడా చేశాడు అని పోలీస్ లకు వాంగ్మూలం ఇస్తుంది. హరి తను తప్పు చేయలేదు అని ఎంత మొత్తుకున్నా.. జూలియట్ వినదు. దీంతో అతనికి జైలు శిక్ష పడుతుంది. 13యేళ్ల తర్వాత కరోనా టైమ్ లో అతను జైలును మార్చే క్రమంలో తప్పించుకుంటాడు. కేవలం జూలియట్ పై పగ తీర్చుకోవడమే లక్ష్యం చేసుకుంటాడు. మరి జూలియట్ పై అతను పగ తీర్చుకున్నాడు. అసలు ఇన్నేళ్ల తర్వాత జూలియట్ ఎలా ఉంది.. ఏం చేస్తూ ఉంటుంది. ఆమె పెళ్లి, పిల్లలు అనేవి కూడా ఉన్నాయా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

కథగా చూస్తే చాలామంది కథ మొత్తం చెప్పావేంటీ అంటారేమో. కానీ అసలు కథ అది కాదు. ఇది కేవలం సినిమా ఆరంభమైన మొదటి పావుగంటలోనే వచ్చే కథ. అసలు కథనం తర్వాత మొదలవుతుంది. చాలా ట్విస్ట్ లు ఉంటాయి. జైలు నుంచి తప్పించుకోవడం.. జూలియట్ పై పగ తీర్చుకునే క్రమంలో చేసిన తప్పులు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. మార్పులు, చేర్పులు చాలానే ఉంటాయి ఈ మూవీలో. అలాగే ఛేజింగ్ లు, కాల్పులు, హాస్పిటల్ ఎపిసోడ్స్, అలాగే హరితో పాటు ఉన్న అమ్మాయి నేపథ్యం.. అతను తప్పు చేశాడా లేదా అనే కోణం.. ఇలా చాలా అంశాలే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో రాసుకున్న విధానం చాలా బావుంది. అసలు ఒక్క సినిమాలో ఇన్ని కోణాలు ఉండటం అరుదుగా ఉంటుంది. ఇలాంటి అరుదైన కథనమే ఈ కథకు చాలా పెద్ద బలంగా ఉంది. ముఖ్యంగా ఎడిటింగ్ చాలా బావుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే కథనం మెయిన్ హైలెట్ గా ఉంటుంది. అదే సినిమాకు ఆయువు పట్టు. ప్రధానమైన కథంతా ఈ సెకండ్ హాఫ్ లో వచ్చే నాన్ లీనియర్ లోనే కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా తెలియాలి అంటే సినిమా మొత్తం చూడాలి. అప్పుడు కానీ అసలు విషయాలు అర్థం కావు.

ఇక ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ సాధారణంగా ఉన్నా.. అనురాగ్ కశ్యప్ పాత్ర మాత్రం అదిరిపోయింది. అతని క్యారెక్టరైజేషన్ కు బాగా రాసుకున్నారు. అతన ఇచ్చిన ట్విస్ట్ ల కంటే ఎదుర్కొన్న ట్విస్ట్ లు అదిరిపోతాయి. అనురాగ్ కులకర్ణి పాత్ర చాలా బావుంది. జెన్యూన్ గా ఉందా పాత్ర. సునిల్ పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంది. ఇక ప్రధాన పాత్రల్లో నటించిన శేష్, మృణాల్ ఇద్దరూ పోటీ పడి నటించారు. ఓ రకంగా మృణాల్ అద్భుతమైన నటనతో శేష్ ను చాలా అంటే చాలానే డామినేట్ చేసింది. ఓ రకంగా అవార్డ్ విన్నింగ్ నటన చూపించింది మృణాల్. సీతారామం తర్వాత ఆమె చేసిన మెమరబుల్ రోల్, యాక్టింగ్ ఇది. ఇలాంటి పాత్రలు హీరోయిన్లకు అరుదుగా వస్తాయి. ఆ ఛాన్స్ ను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంది మృణాల్ ఠాకూర్.

టెక్నికల్ గా చూస్తే భీమ్స్ పాటలు బావున్నాయి. అయితే కొత్తవాడైన గ్యానీ నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. అద్బుతంగా వర్క్ చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ ఎక్స్ ట్రార్డినరీ. డైలాగ్స్ బావున్నాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా రాజీ పడలేదు అని అర్థం అవుతుంది. దర్శకుడు షనీల్ డియో చాలా బాగా హ్యాండిల్ చేశాడీ కథను. అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. చిన్న చిన్న మైనస్ లు ఉన్నా.. ఎడిటింగ్, కథనంతో ఆ మైనస్ లను దాటి ఈ కథను చూపించాడు.

ఫైనల్ గా : డెకాయిట్ .. ఓ ప్యూర్ లవ్ స్టోరీ

రేటింగ్ : 3/5

బాబురావు. కామళ్ల


Full View

Tags:    

Similar News