ఈషా గుప్తా.. టాప్ మాడల్ .. ఫ్యాషనిస్ట్ గా సుపరిచితురాలు. మహేశ్ భట్ తెరకెక్కించిన జన్నత్ 2 మూవీలో ఇమ్రాన్ హష్మీ సరసన నటించి బాలీవుడ్ లో అడుగుపెట్టి పలు భారీ చిత్రాల్లో నటించింది. ఆమె సూటిగా మాట్లాడుతుంది. ఘాటైన స్టేట్మెంట్లతో కొన్నిసార్లు వార్తల్లో నిలిచింది. వీటన్నింటినీ మించి సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. బికినీలు, స్విమ్ సూట్లతో చెలరేగడంలో ఈమె ప్రత్యేకతే వేరు. ఇక ఈషా గుప్తా డేటింగ్ ల గురించి అంతగా సమాచారం లేదు. కానీ గతంలో క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో కొంతకాలం డేటింగ్లో ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆమె కొట్టి పారేసింది. రెండు నెలల పాటు తాము మాట్లాడుకున్నామని, డేటింగ్ చేశామని అనుకోలేదని క్లారిటీ ఇచ్చింది. అంతటితో ఫుల్ స్టాప్ మాత్రం పెట్టకుం డా బిజీ షెడ్యూళ్ల కారణంగా దూరమయ్యామని లేదంటే.. డేటింగ్ చేసేదానినేమో అని చెప్పుకొచ్చింది. గత ఐదేండ్లుగా స్పానిష్ మోడల్ మాన్యుయెల్ కాంపోస్ గుల్లాల్ తో డేటింగ్లో ఉన్న విషయాన్ని మాత్రం ధ్రువీకరించింది. ఇక ఆమె కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. 2019లో టోటల్ ధమాల్ తర్వాత పెద్దగా ఆఫర్లు ఏవీ లేవు. ప్రస్తుతం దేశీ మ్యాజిక్ అనే సినిమాలో నటిస్తోంది. బుల్లితెర షోలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తోంది.