బాలీవుడ్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో దీపికా పదుకొణె- రణ్ వీర్ సింగ్ జోడి ఒకటి. ఇద్దరూ స్టార్సే. 2011 నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట 2018లో పెద్దల అంగీకారంతో ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ప్రస్తుతం ఒక పాప కూడా ఉంది. ఇదిలా ఉంటే రణ్ వీర్ సింగ్ రెండు రోజుల క్రితమే 40 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. తండ్రిగా ప్రమోషన్ పొందిన తర్వాత చాలా గ్రాండ్ గా తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతేకాదు.. హీరో తాజా చిత్రం ధురంధర్ టీజర్ ను కూడా ఈ సందర్భంగా మూవీ టీమ్ విడుదల చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హీరోకు విషెస్ తెలిపారు. కానీ దీపిక పదుకొణే టీజర్ గురించి గానీ, బర్త్ డే గురించి గానీ ప్రస్తావించలేదని గమనించిన ఓ నెటిజన్ కనీసం తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. అయితే అన్నిటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయరని చాలా మంది నెటిజన్లు ఈ వ్యాఖ్య చేసిన వ్యక్తిపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం బిడ్డను చూసుకునే తల్లిగా దీపిక బిజీగా ఉంది. సోషల్ మీడియా పోస్టులపై ఎక్కువగా దృష్టి పెట్టి ఇద్దరి మధ్య బాంధవ్యం లేనట్లు మాట్లాడటం సరికాదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా రణవీర్ సింగ్ మొత్తం ఆస్తులు రూ.362 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. 2019లో అతని వార్షిక ఆదాయం రూ.21 కోట్లు. ఇప్పుడు అది గణనీయంగా పెరిగింది.