12A Railway Colony : ఈ 21న మూవీస్ గట్టిగానే ఉన్నాయి

Update: 2025-11-17 12:32 GMT

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. వస్తోన్న మూవీస్ అంటే మాగ్జిమం నమ్మకంతోనే ఉంటాయి. ఆ మేరకు ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి మూవీస్. ఈ క్రమంలో ఈ శుక్రవారం కూడా ప్రధానంగా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రధానంగా నాలుగు మాత్రమే ఉన్నాయి కానీ పెద్దగా పేరు లేని చిత్రాలు కూడా వస్తున్నాయి. మరి ఆ నాలుగు మూవీస్ ఏంటీ అనేది చూద్దాం.

ఈ మధ్య హీరోగా ఎక్కువ చిత్రాలతో కనిపిస్తున్నాడు ప్రియదర్శి. తను ప్రధానంగా కనిపిస్తోన్న ఈ మూవీస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య అతను హీరోగా నటించిన చిత్రమే ప్రేమంటే. ఈ 21న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆనంది హీరోయిన్ గా కనిపిస్తోంది. తను కూడా తెలుగు మూవీస్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. తెలుగు అమ్మాయి అయినా తమిళ్ లో స్టార్ గా ఎదిగింది తను. ప్రియదర్శితో ఆనందితో కలిసి నటించిన ప్రేమంటే కాస్త ఆకట్టుకునేలా ఉంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మెప్పించే ప్రయత్నం చేస్తోంది. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం చేసిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

రాజు వెడ్స్ రాంబాయి అనే చిత్రం ఈ మధ్య బాగా ఆకట్టుకుంటోంది. ఈ నెల 21నే ఈ మూవీ విడదల కాబోతోంది. ఈ మూవీ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ ఉద్దెమరి, తేజస్విని రావు జంటగా నటించిన చిత్రం ఇది. సాయిలు కాంపాటి దర్శకత్వం చేస్తున్నాడు. ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ తో రూపొందిన సినిమా అనేది ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలు. ఈటీవి ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. మొత్తంగా ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకోవడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుంది.

ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకుని వరుసగా మూవీస్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. అందులో భాగంగా పాంచ్ మినార్ అనే చిత్రంతో వస్తున్నాడు. రాశి సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని కూడా ఈ నెల 21నే విడుదల చేస్తున్నారు. రామ్ కడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ తో ఆకట్టుకుంది. కంప్లీట్ ఫన్ తో మొదలై.. తర్వాత క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కనిపించబోతోందనేది అర్థం అవుతోంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో.

ఇక నాలుగో సినిమాకు ఎక్కువమందిని ఆకట్టుకుంటోంది 12ఏ రైల్వే కాలనీ. అల్లరి నరేష్ హీరోగా నటించిన మూవీ ఇది. కామాక్షి భాస్కర్ల హీరోయిన్. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. టైటిల్ ను బట్టి కథను జడ్జ్ చేయొచ్చేమో అనిపించేలా ఉన్నాయి.. అందుకు భిన్నంగా కనిపిస్తోంది కథ అర్థం అవుతోంది. పొలిమే, పొలిమేర 2 చిత్రాలతో ఆకట్టుకున్నాడు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన సినిమాగా కనిపిస్తోంది. దర్శకుడి పేరు మాత్రమే నాని కాసరగడ్డ అనే పేరు మాత్రం వేశారు. నరేష్ కు కొత్తగా అనిపిస్తోన్న ఈ మూవీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతోంది అనిపించేలా ఉంది. మొత్తంగా ఈ నాలుగు చిత్రాలపై ఇండస్ట్రీ మాత్రం బాగా ఫోకస్ చేశారు. నాలుగు మూవీస్ కూడా వేర్వేరు జానర్ లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆడియన్స్ లో కూడా ఆకట్టుకుంటాయి అనిపించేలా ఉన్నాయి.

Tags:    

Similar News