స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అందుకు కారణం అతను రీ రిలీజ్ చేస్తోన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు విడుదల చేస్తోన్న థియేటర్స్ అన్నీ ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. ఇంకా డిమండ్ ఉంది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. ఈ ఆనందాన్ని మీడియాతో పంచుకుంటూ విజయ్ దేవరకొండ మూవీకి సంబంధించి టంగ్ స్లిప్ అయ్యి టైటిల్ కూడా చెప్పేశాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్ డమ్ అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రాజా వారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ నే దిల్ రాజు యాక్సిడెంటల్ గా రివీల్ చేశాడు. ‘‘రౌడీ జనార్ధన్’’.. ఇదే రవి కిరణ్, విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ అని చెప్పాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పూర్తయిందట. ఏప్రిల్ లేదా మే నెలలో షూటింగ్ కు వెళతారని చెప్పాడు. అలాగే ఎల్లమ్మ కూడా అదే టైమ్ కు స్టార్ట్ అవుతుందన్నాడు దిల్ రాజు.
ఇక విజయ్ కింగ్ డమ్ కు సంబంధించి ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో ఉన్నాడు. ఓ పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది. ఆ వెంటనే రౌడీ జనార్ధన్ గా కొత్త అవతారం మొదలుపెడతాడు. కాకపోతే ఈ టైటిల్ చూస్తే నైన్టీస్ లో వచ్చిన డబ్బింగ్ టైటిల్ లా ఉందనే కామెంట్స్ కూడా అప్పుడే వస్తుండటం విశేషం.